నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రతి పల్లెనూ అభివృద్ధి చేస్తానని నెల్లిమర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థి లోకం మాధవి తెలిపారు. మండలంలోని నాతవలస, సింగవరం, మహంతిపేట, గుణుపూరు, డెంకాడ గ్రామాల్లో ఈమె బుధవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పతివాడ అప్పలనారాయణ, పల్లె భాస్కరరావు, కలిదిండి పాణిరాజు, ప్రదీప్‌రాజు, సత్యనారాయణరెడ్డి, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa