గూగుల్ చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా ఇండియన్ రైల్వేస్ తీవ్ర విమర్శలు, ట్రోలింగ్‌కు గురవుతోంది. అంతపెద్ద భారతీయ రైల్వేలు ఇలాంటి చిన్న చిన్న తప్పులు కూడా గుర్తించకపోవడం ఏంటి అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అయితే రైళ్లకు అత్యంత ముఖ్యమైంది దాని పేరే. ప్రయాణికులు రైళ్లను వాటి పేరు ఆధారంగానే గుర్తించడం గానీ, టికెట్లు బుక్ చేసుకోవడం గానీ చేస్తూ ఉంటారు. అలాంటి పేరే తప్పుగా ఉంటే ఏంటి పరిస్థితి. అది కూడా పూర్తిగా తప్పు ఉంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి అనే దానికి ఈ సంఘటనే నిదర్శనం.
గూగుల్ చేసిన తప్పుకు నెటిజన్లు.. ఇండియన్ రైల్వేస్‌ను ఏకి పారేస్తున్నారు. రైలు పేరును గూగుల్ ట్రాన్స్‌లేట్ చేయగా.. అది మర్డర్ ఎక్స్‌ప్రెస్ అని చూపించింది. అయితే అది గుర్తించని రైల్వే అధికారులు.. ఆ పేరునే రైలుపై రాయడంతో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎట్టకేలకు దాన్ని గుర్తించిన రైల్వేశాఖ ఆ పేరును మార్చింది.
జార్ఖండ్ రాజధాని రాంచీలోని హటియా నుంచి కేరళలోని ఎర్నాకుళం వరకు వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఒకటి నడుస్తోంది. అయితే దాని పేరు హటియా ఎక్స్‌ప్రెస్ కాగా దాని పేరును రైల్వే అధికారులు గూగుల్ ట్రాన్స్‌లేషన్ ఉపయోగించి ఇంగ్లీష్ నుంచి మలయాళంలోకి అనువాదించారు. ఇక గూగుల్ ట్రాన్స్‌లేషన్‌లో హటియా కాస్తా.. హతియా అయింది. అయితే హతియా అంటే హంతకుడు కాగా దానికి మలయాళంలో "కోలపథకం" అని రాశారు.
దీంతో హటియా-ఎర్నాకుళం మధ్య వారానికి ఒకసారి నడిచే రైలు కాస్తా హతియా ఎక్స్‌ప్రెస్ లేదా మర్డర్ ఎక్స్‌ప్రెస్‌గా మారిపోయింది. దీంతో హటియా పేరును తప్పుగా ట్రాన్స్‌లేట్ చేయడంతో ఆ రైలు పేరు కాస్తా మర్డర్ ఎక్స్‌ప్రెస్‌గా మారిపోయింది. అయితే అది గుర్తించని రైల్వే శాఖ అధికారులు.. రైలు నేమ్ బోర్డుపై అదే పేరును రాశారు. ఆ పేరుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దీంతో అందులో తప్పు ఉందంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కేరళ వాసులు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రతీ దానికీ గూగుల్ ట్రాన్స్‌లేషన్‌పై ఆధారపడటం వల్లే ఇలాంటి గందరగోళం జరుగుతోందని కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన రైల్వే అధికారులు.. తప్పుడు అనువాదం వల్ల జరిగిన పొరపాటును గుర్తించి.. దాన్ని సరిచేసినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని రాంచీ డివిజన్ సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
![]() |
![]() |