ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల అప్ డేట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 06:16 PM

 4వ విడత లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏపీలో ఓటర్ల సంఖ్యకు సంబంధించి ఈసీ ఫైనల్ లిస్ట్‌ని రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మే 13న జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2.2 కోట్ల పురుష ఓటర్లు, 2.10 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు. మిగతా వాటిలో సర్వీస్ ఓటర్లు, థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో కొత్త ఓటర్లు 5.94 లక్షలు నమోదైనట్లు ఎన్నికల సీఈవో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa