ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిఠాపురంలో డైలాగ్ వార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 06:19 PM

సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి. పిఠాపురం నియోజకవర్గంలో నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. వైసీపీ అభ్యర్థి వంగా గీతకు.. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీలో చేరిన తర్వాత నోటికొచ్చి మాట్లాడుతూ.. ఆఖరికి జనసేన అధినేత, పిఠాపురం అభ్యర్థి పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో.. ఆయన కూతురు క్రాంతి రంగంలోకి దిగారు. అలా మాట్లాడటం సరికాదని సూచించారు. ఆ వెంటనే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ లైన్‌లోకి వచ్చారు. ముద్రగడ పద్మనాభంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa