ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. రెండోసారి తనను సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేయడంతో క్యాట్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనే వాదనలు పూర్తవ్వగా తీర్పును రిజర్వ్ చేసిన క్యాట్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరారవును రెండోసారి సస్పెండ్ చేయడం న్యాయ విరుద్దమని క్యాట్ వ్యాఖ్యానించింది. తక్షణమే ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్‌లోకి తీసుకుని ఆయనకు రావాల్సిన ఎరియర్స్ మొత్తం ఇవ్వాలంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆదేశాల్లో స్పష్టం చేసింది. సస్పెన్షన్ చట్ట విరుద్దమని, ఒకసారి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa