మే 13న ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఏపీలోని రాజకీయ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. పార్టీ పెద్దలు సైతం రంగంలోకి దిగి.. తమ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎండలు భగభగమంటూ మండిపోతున్నా.. లెక్క చేయకుండా బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కడపకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి వైఎస్ షర్మిల రెడ్డి గెలుపు కోసం ఈ నెల 11న ఆయన కడప జిల్లాకు వస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa