శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 21, 481 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారని ఆయా అధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు సులువుగా వెళ్లేందుకు అధికారులు ర్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. వారికోసం 1, 741 వీల్ చైర్లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాలలో వృద్ధులు మహిళల కోసం జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశాల మేరకు తాగునీటిని అందుబాటులో ఉంచారు.