ఓటు మిస్ అయిందని ప్రిసైడింగ్ అధికారి నిర్ధారించుకొని.. టెండర్ బ్యాలెట్ పేపర్‌ను ప్రిసైడింగ్ అధికారి ఓటు కోల్పోయిన వ్యక్తికి ఇస్తారు. బ్యాలెట్ పేపర్‌పై మీరు వేయాలని భావించే అభ్యర్థికి ఓటు వేసి.. ఆ బ్యాలెట్ పేపర్‌ను తిరిగి ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి. దాన్ని ప్రిసైడింగ్ అధికారి.. ప్రత్యేక కవర్‌లో దాచి.. కౌంటింగ్ కేంద్రానికి పంపిస్తారు. దీంతో మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అవుతుంది.