సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. అల్లర్లపై దర్యాప్తు కోసం వేసిన సిట్ వెస్ట్ అని, దానివల్ల ఉపయోగం లేదని అన్నారు. ఏపీలో స్ట్రాంగ్ రూంలో ఉన్న ఈవీఎంలకు భద్రత లేదని, ఎక్కడా సీసీ కెమెరాలు లేవని విమర్శించారు. కిందిస్థాయిలో పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, దాడులపై విచారణకు వేసిన సిట్ ఒక బోగస్ అని నారాయణ వ్యాఖ్యానించారు.