మాచర్ల, తిరుపతి, తాడిపత్రిలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోగా దాడిపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఎన్నికల రోజు, అనంతరం జరిగిన దాడులపై సీఈసీ సిట్ ఏర్పాటు చేయగా... విచారణ చేసిన సిట్ తమ రిపోర్టును డీజీపీకి అందజేసింది. దాడులకు బాధ్యులను చేస్తూ ఆయా జిల్లాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను బదిలీ, సస్పెండ్ చేసిన విషయమూ విధితమే. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 6వరకు అరెస్టు చేయెుద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు పెదవి విరుస్తున్నారు. వైకాపా నాయకులను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతోనే వంశీ మోహన్ సైతం దాడులకు తెగబడుతున్నారని పలువురు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.