ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఐజీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. సోమవారం యాడికి పోలీస్ స్టేషను ఆయన వచ్చారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన అల్లర్లు, గొడవలు, ప్రస్తుత పరిస్థితులపై సీఐ నాగార్జునరెడ్డితో వివరాలు ఆరాతీశారు. కోనుప్పలపాడు, గుడిపాడు రాయలచెరువువంటి సమస్యాత్మక గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెక్షన్ 144అమలులో ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa