పెదబయలు మండలంలోని గిన్నెలకోట పంచాయతీలోని తారాబు పిట్టలబొర గ్రామాలకు మధ్యలో ఉన్న పిట్టలబొర జలపాతానికి పర్యటకుల తాకిడి పెరిగింది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో రాష్ట్రంలోని పలు మూలల నుంచి పలువురు పర్యటకులు కుటుంబ సమేతంగా జలపాతం వద్ద చేరుకుని సరదాగా గడుపుతూ సెల్ఫీలు తీసుకుంటూ ఫిదా అవుతున్నారు. అయితే అల్లూరి జిల్లాలో పలు సందర్శన ప్రాంతాల్లో బుధవారం పర్యాటకులతో ఇదే తరహా సందడి వాతారణం నెలకొంది.