సీతానగరం మండలంలో జోగంపేట గ్రామంలో సోమవారం రాత్రి ఆరుబయట పడుకున్న మరిశర్ల సుగుణ అనే మహిళ మెడలోని బంగా రపు పుస్తెలతాడును దొంగలు కట్ చేసి పట్టుకుపోయారు. దీనిపై వారు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు ఇంచార్జి ఎస్ఐ పాపారావు తెలిపారు. పార్వతీపురం సీఐ రవికుమార్‌తో కలిసి ఆయన ఘటన స్థలాన్ని పరిశీలించి అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో సచివాలయ మహిళా పోలీస్ సిబ్బంది ప్రజలను మరింత అప్రమత్తమయ్యేలా తగు సూచనలు తెలియజేయాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు లేదా 100 కు ఫోన్ చేసి సమాచారమందించాలన్నారు.