నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని తూర్పుమహారాజుపేట(కొండపేట)లో బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని ఒంటిపైన, తలపైన గాయాలు ఉండడం, ఆ స్థలంలో రక్తమోడి ఉండడంతో హత్యకు గురై ఉండవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండపేటకు చెందిన కారెపు చైతన్య (16) ఇటీ వలే పదో తరగతి సప్లిమెంటరీలో పాసై ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. అతడిని ఇంటర్ లో చేర్చేందుకు తల్లి భారతి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం మ ధ్యాహ్నం 2 గంటల కు ఇంటి నుంచి బయటకు వెళ్లిన చైతన్య ఇంటికి రాత్రైనా ఇంటి కి రాలేదు. కుమారుడి కోసం తల్లి గ్రామంలో వాకబు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో సోమవారం రాత్రి నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంధువులు కూడా సోమవారం రాత్రి గ్రామ పరిసరాల్లో వెతికి, అందరికీ ఫోన్లు చేసినా ఆచూకీ దొరక లేదు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గ్రామానికి ఆనుకుని తూర్పున ఉన్న కొండ ప్రాంతంలో మృతదేహం ఉన్న ట్లు తెలియడంతో బంధువులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి లబోదిబోమన్నారు.