రోడ్డు ప్రమాదంలో మహిళ గాయపడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజాం మండలం బొద్దాం గ్రామానికి తులసి తన కుమారుడితో ద్విచక్ర వాహనంపై రాజాం వస్తుండగా పెనుబాక గ్రామ జంక్షన్ వద్ద ఆవు అడ్డంగా వచ్చి దాడి చేయడంతో ద్విచక్ర వాహనం బోల్తాపడింది. దీంతో తులసి తలకు బలమైన గాయమైంది. స్థానికులు 108 వాహనంలో రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విష మం కావడంతో మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రాజాం పొలీసులు కేసు నమోదు చేశారు.
![]() |
![]() |