గుంతకల్లు పట్టణంలోని దోనిముక్కల రోడ్డులోని సుంకలమ్మ కాలనీలో నివాసం ఉండే మల్లేశ్వరిపై ఆమె భర్త రంగన్న మంగళవారం బేడ్లుతో దాడి చేశాడు. బాధితురాలు తెలిపిన మేరకు మల్లేశ్వరికి పెయింటర్‌గా పనిచేస్తున్న రంగన్నతో 12 సంవత్సరాల కిందట వివాహం అయ్యింది. అప్పటి నుంచి కూడా అనుమానంతో రోజు గొడవ పడేవాడన్నారు. గతంలో కూడా ఒకసారి కొడవలితో దాడికి యత్నించాడన్నారు. ఈవిషయంపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. గొడవల విషయంగా మంగళవారం ఉదయం తన పుట్టింటివారు, భర్త తరఫు బంధువులు పంచాయితీ చేశారన్నారు. ఈక్ర మంలో తనకు భర్త వద్దు అని చెప్పినట్లు బాధితురాలు పేర్కొన్నారు. దీంతో మధ్యాహ్నం ఇంట్లో ఉన్న మల్లేశ్వరిపై బ్లేడుతో రంగన్న దాడి చేశాడన్నారు. మెడపైన గాయం కావడంతో కుటుంబసభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు.