కళ్యాణదుర్గం పట్టణంలోని మేడావీధిలో గల పూలవాండ్ల సందులో పాదచారులు నడవలేని విధంగా మురికి నీరు రహదారిపై పేరుకుపోవడంతో కాలనీవాసులు నానా ఇబ్బందులు పడుతున్నామని మంగళవారం తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు మున్సిపల్ సిబ్బంది, స్థానిక కౌన్సిలర్ కు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపైనే మురికి నీరు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలకు నిలయాలుగా మారిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa