2015-16 సంవత్సరంలో విజయవాడ సబ్ కలెక్టర్‌గా పనిచేసిన విషయాన్ని కృష్ణా జిల్లా, నూతన కలెక్టర్ సృజన గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఇక్కడే కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లాను అందరి సహకారంతో నిర్దేశించుకున్న ప్రణాళికలు, లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు అడుగులు వేయటం జరుగుతుందన్నారు. జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ లక్ష్యాలను సాధిస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లాను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు వీటి బారిన పడకుండా ఉండటానికి చర్యలు తీసుకోవటం తక్షణ కర్తవ్యమన్నారు. డయేరియా, మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా పనిచేస్తామన్నారు. తాగునీటి పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తామని, రక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించే చర్యలను చేపట్టనున్నట్టు చెప్పారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా జేసీ పి.సంపత్ కుమార్, విజయవాడ మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినరర్, డీఆర్వో వి.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్డీవో భవానీ శంకర్‌లు నూతన కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.