విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి చెందిన ఘటనలో బాధ్యులను వదిలి చిరుద్యోగిపై విద్యుత్‌శాఖ అధికారులు వేటు వేశారు. పెద్ద దోర్నాల మండలంలోని చిన్నగుడిపాడు సచివాలయం జేఎల్‌ఎంగా దూదేకుల మస్తాన్‌వలి విధులు నిర్వహిస్తు న్నాడు. ఈ నెల 20వ తేదీన చిన్నగుడిపాడు గ్రామ పొలాల్లో మేతకు వెళ్లిన రెండు పాడి గేదెలు నేలకు దగ్గరగా ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ తీగలు తాకి ఘటనా స్థలంలో మృతి చెందిన విషయం పాఠకులకు విధితమే. కాగా ఈ ఘటనపై విద్యుత్తు శాఖ ఉన్నతాధి కారులు చేపట్టిన చర్యల్లో భాగంగా సచివా లయం జేఎల్‌ఎం గ్రేడ్ -2 ఉద్యోగి మస్తాన్‌వలిని అందుకు బాధ్యుడిని చేశారు. ఈ నెల 22న ఉద్యోగ బాధ్యతల నుండి రిలీవ్ చేశారు. అయితే దీనిపై మస్తాన్‌వలి స్పందిస్తూ.., ఘటనకు తనను అన్యాయంగా బాధితుడిని చేశారన్నారు. అసలు 11కేవి లైను పర్వవేక్షణ తన పరిధిలోనిది కాదన్నారు. అయినా ఈ నెల 7న ట్రాన్స్‌ఫార్మర్ నేలకు దగ్గరగా ఉందని ఏ ప్రమాదమైనా జరిగే అవకాశముందని అబ్జర్వేషన్ లిస్టులో నమోదు చేశాన్నారు. లైన్‌మెన్ నాయక్‌కు కూడా విషయం తెలియజేసినట్లు తెలిపారు. తీరా గేదెలు మృతిచెందితే తనను బాధ్యున్ని ఎలా చేస్తారని ఆయన ఆందోళన వెలిబుచ్చాడు. ఆ ఘటనలో లైన్‌మెన్, ఏఈల పొరబాటు ఉంటే ఉన్నతాధికారి డీఈ తనను బాధ్యుడిని చేశారన్నారు. లైన్‌మెన్, డీఈలు ఉద్దేశ్య పూర్వకంగా తనను రిలీవ్ చేశారని ఆరోపించాడు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని మస్తాన్ వలి కోరాడు.