మార్కాపురం పరిధిలోని త్రిపురాంతకం మండలం దూపాడు వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజీ ట్యాంకును మార్కాపురం టీడీపీ నాయకులు బుధవారం పరిశీలించారు. మూడు రోజులుగా సాగర్ ప్రధాన కాలువ నుంచి ఎస్‌ఎస్ ట్యాంకుకు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం నీటిని పంపింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పంపింగ్ జరుగుతున్న తీరును పరిశీలిం చాలని స్థానిక టీడీపీ నాయకులకు సూచించారు. ఈ క్రమంలో నియోజకవర్గ పోల్‌మేనేజ్‌మెంట్ ఇన్‌చార్జ్ కందుల రామిరెడ్డి సాగర్ ప్రధాన కాలువ నుంచి ఎస్‌ఎస్ ట్యాంకుకు నీటిని పంపింగ్ చేస్తున్న తీరును పరిశీలించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే పంపింగ్ నిలిపివేయకుండా జనరేటర్ సాయంతో నీటిని ఎస్‌ఎస్ ట్యాంకుకు చేర్చాలని ఇంజనీరింగ్ అధికారులకు రామిరెడ్డి సూచించారు. ప్రధాన కాలువలో ప్రవాహం తగ్గినా గడ్డర్లు ఏర్పాటు చేసి అదనపు నీటిని పంపింగ్ చేసుకునే విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకో వాలన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు మాలపాటి వెంకటరెడ్డి, బొగ్గు శేఖర్‌రెడ్డి, గుంటక శ్రీనివాసరెడ్డిలు ఉన్నారు.