పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకడమిక్ క్యాలెండర్ సోమవారం విడుదల చేశాను. అనంతరం ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను. ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉంచాలని స్పష్టం చేశాను. స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల పదవీకాలం జూలైతో పూర్తయినందున ఆగస్టులో కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని సూచించాను. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని నిర్ణయించాం. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా సూచించాను.