ఈరోజు ధర్మవరం ఏరియా ఆస్పత్రిని పరిశీలించి. అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు వసతులు ఎలా ఉన్నాయి.. ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతున్నాయా? అని ఆరా తీశారు .ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవలు, వైద్య సిబ్బంది గురించి డాక్టర్ల నుంచి వివరాలు తీసుకున్నారు. ఆస్పత్రిలో పరిస్థితులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సమస్యలకు సంబంధించి రివ్యూ సమావేశం నిర్వహించారు.సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తానని డాక్టర్లు, సిబ్బందికి హామీ ఇచ్చారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆస్పత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడకుండా దాతల నుంచి కూడా విరాళాలు సేకరించాలని కోరాను. అందరం కలిసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు