టీడీపీ కూటమి ప్రభుత్వంలో పేదల ఇంటి నిర్మాణానికి రూ.4లక్షలు ఇచ్చేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని డోన్ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం డోన్‌పట్టణంలోని పాతపేటలో ఆయా కాలనీల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా మహిళలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసున్నారు. అనంతరం కోట్ల మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు సీఎం చంద్రబాబు డబుల్ బోనంజా ప్రకటించార న్నారు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో అర్హులైన వారందరికి స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. డోన్ మున్సి పాలిటీలో వార్డుల్లో ప్రజలకు వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జయరాం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోట్రిక ఫణిరాజ్, వలసల రామక్రిష్ణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మేన్ కేశన్నగౌడు, మాజీ సర్పంచు కేశవయ్యగౌడు, మున్సిపల్ వైస్ చైర్మేన్ కోట్రిక హరికిషన్, జిల్లా అధికార ప్రతినిధి విజయ్‌భట్టు, ఓబులాపురం శేషిరెడ్డి, సర్పంచు రేగటి అర్జున్‌రెడ్డి, సుదీష్, ఓంప్రకాష్, అన్వర్‌బాషా పాల్గొన్నారు.