ఈ మధ్య సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న మెగా బ్రదర్, . బాలయ్య ఎప్పుడో పవన్ కళ్యాణ్ మీద ఏదో అన్నాడని దానిని అడ్డం పెట్టుకుని దాదాపుగా నెలరోజులు బాలయ్య ను విమర్శిస్తూ వీడియోలు పెట్టి టార్గెట్ చేసి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కమ్మ కాపు కులాల మధ్య చిచ్చు పెట్టి జనసేనకు లబ్ది చేకూర్చడం కోసమే నాగబాబు ఇలా చేస్తున్నారన్న విమర్శలు వచ్చినా... బాలయ్య సమన్వయం పాటించడంతో పాటు నాగబాబు వ్యాఖ్యలను పట్టించుకోకపోవటం, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసినా పార్టీ శ్రేణుల ద్వారా వారిని నిలువరించడంతో ఆ గొడవ తప్పింది.
కానీ నాగబాబు తాజాగా నా ఇష్టం అని ఓ వెబ్ సిరీస్ మొదలు పెట్టి ఏపిలోని రాజకీయ నాయకులు ఎప్పుడన్నా నోరు జారిన విషయాలని సేకరించి మరీ సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటివరకు లోకేష్, జగన్ లను టార్గెట్ చేశారు. అయితే గత కొంత కాలంగా ఆయన రాజకీయాలలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో పాటు టిడిపి ఫైర్ ఎమ్మెల్యే చింతమనేనికి సవాళ్లు విసరిన క్రమంలో పవన్ కళ్యణ్ ఈ నియోజకవర్గం నుంచి నాగబాబుని నిలపనున్నారని వార్తలొచ్చాయి. తమ్ముడు పార్టీపై ప్రజలకు ప్రజారాజ్యం రోజులు గుర్తు రాకూడదని జనసేనకు దూరం గా ఉంటున్న నాగబాబు ఎమ్మెల్్య్లే అనగానే రంగ ప్రవేశం చేసారని, తన కుటుంబం తరపున అంటూ దాదాపు కోటిన్నర సాయం జనసేనకు అందించటంతో పాటు తెరవెనుక మంత్రాంగం నడుతుపుతున్నట్టు కనిపిస్తోందని పరిశీలుకుల మాట.
గత కొద్ది రోజులుగా నాగబాబు రాజమహేంద్రవరంలో విడిది చేసి జనసేనకు మద్దతుగా చాలా మంది కాపు నేతలని గతంలో ప్రజారాజ్యం లో క్రియా శీలంగా పనిచేసిన వారిని, కలిసి తన తమ్ముడికోసం, పార్టీ కోసం పని చెయ్యమని అడుగుతున్నారని తెలుస్తుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టే ముందు పెట్టిన తరువాత నాగబాబు చేసిన పని ఇదే. ఎన్నికల సమయానికి మరింత మందిని కలవాలని, వీలుంటే పార్టీతరపున పోటీకి దిగేందుకు తను సిద్దమేనని పవన్‌కి నాగబాబు చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పటికే చాలా మంది నేతలకు హామీ ఇవ్వటంతో పాటు మరింత మంది ఎన్నికల ప్రకటన తదుపరి పార్టీలో చేరే అవకాశం ఉన్నందున ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చి పార్టీ గౌరవిస్తుందని మరికొందరు చెపుతున్నారు. కాగా నాగబాబు చాపకింద నీరులా చేస్తున్న నా ఇష్టం కార్యక్రమానికి పార్టీకి సంబంధం లేదని జనసేన పార్టీ వర్గాలు చెపుతుంటే, ఇతర నాయకులు చెప్పిన వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్న నాగబాబు పవన్ నోరుజారిన పలు మాటలపైనా సెటైర్లేస్తారా? అని నిలదీస్తున్నారు నెటిజన్లు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa