పలు రాష్ట్రాల్లోని గవర్నర్‌లు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.15 వేల కోట్లు అప్పుగానే ఇస్తోందని, ప్రత్యేక హోదా కావాలని సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామని నారాయణ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తే సరిపోదని..నిర్వాసితులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో శాంతి భద్రతలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదన్నారు. అసెంబ్లీకి వెళ్ళకుండా ఢిల్లీకి జగన్ ఎందుకు వెళ్ళారని..? నారాయణ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రజా సమస్యలపై జగన్ పోరాటం చేయాలే తప్ప పనికిమాలిన పనులు చేయడం మానుకోవాలని సూచించారు. దేశంలో రాబోయే ఏ ఎన్నికలైనా ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో పెడితే మంచిదని నారాయణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.