రాష్ట్రపతి ఎన్డీయే ప్రభుత్వ గొప్పలు చెప్పారు. కొత్తగా రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ గురించి ఏదో చెప్తారని ఆశించలేదు.ఆయన చెప్పలేదని వైసీపీ నేత మేకపాటి రాజ్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను సాధించే బాధ్యత సీఎం చంద్రబాబు దేనన్నారు. వైసీపీ ధర్నాలు చేసినప్పుడు ఎగతాళి చేసిన చంద్రబాబు, ఇప్పుడు స్వయంగా ఆయనే ధర్నాకు దిగుతున్నారు. జగన్ నవరత్నాలను కాపీ కొడుతున్నారు. చంద్రబాబు మహా మాయవి. ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబు దిట్ట. రాష్ట్రానికి రావాల్సిన అంశాలను సాధించే ప్రజలను చంద్రబాబు ఓటు అడగాలి. అభివృద్ధి ఆగిపోతుంది అంటూ ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. చంద్రబాబు పాలనతో ప్రజలు విసుగు చెంది ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు కి గుణపాఠం చెప్తారు. పార్టీ మారుతున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా. తప్పుడు ప్రచారం చేయడం బాధకారం. పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుంచే జగన్ తో ఉన్నాను. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. అంత అయిపోయాక కలిసి పోరాటం చేస్తా అనడం ఏంటి? అని మేకపాటి ప్రశ్నించారు.