శ్రీశైలంలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీశైలం దేవస్థానం ఏఈఓ మోహన్ గృహంలోని కాంపౌండ్‌లో చిరుత పులి సంచారించింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. పాతాళగంగ మార్గంలోని ఇంటి ప్రహరీ గోడపై మంగళవారం తెల్లవారుజామున నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లేందుకు చిరుత ప్రయత్నించింది. ఇంటి ప్రహరీగోడపై చిరుతపులి ఉన్న వీడియో సీపీ టీవీఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. చిరుతపులి తిరిగిన ప్రదేశాలను అటవిశాఖ అధికారులు పరిశీలించారు. చిరుత సంచారం నేపథ్యంలో రాత్రుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని స్దానికులకు సిబ్బంది విజ్ఞప్తి చేశారు. వీలనంత త్వరగా చిరుత బంధించాలని స్థానికులు వినతి చేస్తున్నారు. చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు యత్నిస్తున్నారు.