ఇంటర్నేషనల్ యూతడే సందర్భంగా 29వ తేదీన 5కే రెడ్‌రనమారథాన నిర్వహిస్తున్నట్లు డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి పేర్కొన్నారు. గురువారం అనంతపురం జిల్లా కార్యాలయంలో మారథానపై పోగ్రామ్ అధికారులతో ఆమె సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ హెచఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన పెంచడం కోసం ఎయిడ్స్ నియంత్రణ విభాగం, వైద్యశాఖ సంయుక్తంగా మారథాన నిర్వహిస్తున్నాయన్నారు. జిల్లాకేంద్రంలో ఉదయం 6-30గంటలకు స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రారంభమై టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, సర్వజన ఆస్పత్రి, కోర్టు రోడ్డుమీదుగా తిరిగి ఆర్ట్స్ కాలేజ్ వరకు రన కొనసాగుతుందన్నారు. జూనియర్, డిగ్రీ కళాశాలలు, పాఠశాలలు, ఎనసీసీ విభాగాల అధికారులు సహకరించాలని ఆమె కోరారు. సమావేశంలో ఎయిడ్స్ నియంత్రణాధికారి అనుపమజేమ్స్, పోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుజాత, సూపర్‌వైజర్ జీవీ రమణ పాల్గొన్నారు.