ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి మత్తు పదార్థాలను సేవించే 136 హాట్‌స్పాట్‌లను గుర్తించడం జరిగిందని పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు అన్నారు. కమిషనరేట్ పరిధిలో 1900 సీసీ కెమేరాలు ఏర్పాటు చేయగా వీటిలో 1300 మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. కళాజాతాల ద్వారా గ్రామాలలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయడం ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో మంచి ఫలితాలు సాధించే అవకాశం వుంటుందని సీపీ తెలిపారు. సమావేశంలో డీసీపీలు గౌతమి శాలి, కె.ఎం.మహేశ్వరరావు, కె.చక్రవర్తి, ఏసీసీ కె.వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి వి.శ్రీనివాసరావు, విజయవాడ, తిరువూరు, నందిగామ ఆర్డీవోలు బీహెచ్.భవానీశంకర్, కె.మాధవి, ఎ.రవీంద్రరావు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.మహేష్, విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ వి.కామరాజు, డీఈవో యు.వి.సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ జె.ఉషారాణి, ఎక్సైజ్ డీపీఈఓ బి.శ్రీనాధుడు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి కె.నాగమణెమ్మ, ఉద్యానవన అధికారి బాలాజీ కుమార్, డి ఎడిక్షన్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు ఎస్‌ఎల్ రాజు, అరవ రమేష్, డాక్టర్ శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.