మంతెన సత్యనరాయణ రాజు ఆశ్రమం వద్ద ఔట్ శ్లైస్ 75 శాతం సరిచేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అక్కడ ఆ గేట్లకు కనీసం గ్రీజ్ పెట్టకపోవడం వల్ల ఆ గేట్లు కొట్టుకుపోయాయని అన్నారు. 69 నెంబరు గేట్ వద్ద కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అయిందని చెప్పారు. దాన్ని తిరిగి కన్నయ్య నాయుడు ద్వారా ఆయన్ను రప్పించి గేట్‌ను రిపేర్ చేయిస్తామని తెలిపారు. ఆ గేట్ కౌంటర్ వెయిట్‌ను రిపేర్ చేస్తామని అన్నారు. ఫ్లడ్ తగ్గితే గేట్‌ను క్లోజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. 2,3 నెలల్లో కురవాల్సిన వర్షం తక్కువ గంటల్లో 24 గంటల్లో కురవడం వల్ల ప్రమాదం సంభవించిందని వివరించారు.వరద ప్రభావం లేని జిల్లాల మంత్రులకు ఇక్కడ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. అన్ని సరిహద్దు జిల్లాల నుంచి ఫుడ్ పాకెట్స్ అందించాలని నిర్ణయించామని అన్నారు. ఇంత ఎఫెక్టివ్‌గా ప్రభుత్వం పనిచేస్తుంటే వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లడుతున్నారని మండిపడ్డారు. బోటులు వచ్చి ప్రకాశం బ్యారేజీకి తగలడం వెనుక కుట్ర ఉందమోనని చెప్పారు.. ఇప్పుడు తమ ప్రయారిటీ కాదని చెప్పారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం తమ లక్ష్యమని చెప్పారు. ఫేక్, పేటైఏం న్యూస్ మీరు నమ్మొద్దని అన్నారు.ప్రజలు పిలిస్తే పలికే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా రాజధానిపై వైసీపీది విషప్రచారమని విమర్శలు చేశారు. ఆయన ప్రతిపక్షంలో ఓకే అని తర్వాత 3 ముక్కలట ఆడారని అన్నారు. హైదరాబాద్, చైన్నె చిన్న వర్షానికి మునిగిపోతున్నాయన్నారు. అమరావతి ముంపు లేని ప్రాంతమని స్పష్టం చేశారు. అబద్ధాలు, అసత్యాలు నిత్యం వైసీపీ చెబుతోందని విమర్శలు చేశారు. ప్రకాశం బ్యారేజి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఫ్లడ్ తగ్గితే గేట్ క్లోజ్ చేయడానికి ఇబ్బంది లేదని అన్నారు. వెంటనే కౌంటర్ వెయిట్‌ను క్లియర్ చేస్తామని వివరించారు. హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చామని.. లక్షలాది మంది నుంచి ఫోన్లు వస్తాయన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ను అనుకొని విజయవాడ, గుంటూరు, సిటీ ప్రజలు ఉన్నారని తెలిపారు. సాయం అందించడంలో ఆలస్యం లేకుండా చూస్తున్నామని చెప్పారు. పులిచింతల, ప్రకాశం బ్యారేజికి మధ్య లోకల్ క్యాచ్ మెంట్ నుంచి 5 లక్షల క్యూసిక్లు వచ్చాయన్నారు. ఫ్యూచర్లో ఇలాంటి ఫ్లడ్ వచ్చినప్పుడు బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూడాలని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.