రాజస్థాన్‌లోని దేశ్‌నోక్‌లో ఉన్న కర్ణిమాత ఆలయం ప్రపంచంలోనే ‘ఎలుకల ఏకైక దేవాలయం’గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో 20 వేలకి పైగా నలుపు, తెలుపు ఎలుకలు ఉన్నాయి. ఇవి ఈ ఆలయంలోనే నివసిస్తాయి. అంతే కాదు వాటిని పూజిస్తారు కూడా.
ఇక్కడ ఎలుకలను పవిత్రంగా పరిగణిస్తారు. వాటిని “కబ్బా” అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని 19వ శతాబ్దంలో మహారాజా గంగా సింగ్ నిర్మించారు. మొఘల్ శైలిలో రూపొందించబడిన ఈ ఆలయాన్ని నిర్మించడానికి పాలరాతి రాళ్లను ఉపయోగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa