గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కచ్‌లోని ఓ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారీ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 వాహనాల్లో వచ్చి మంటలను అదుపుచేస్తున్నారు. మరోవైపు, గాంధీధామ్ మునిసిపాలిటీ, అంజర్ మునిసిపాలిటీ, టింబర్ అసోసియేషన్ వారు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాగా, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.