ఉత్తరాంధ్రలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని వైయస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో విజయసాయిరెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ...... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకమన్నారు. అవసరమైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయడం లేదన్నారు. దస్పల్లా, ఎన్‌సీసీ భూములతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదు అని పేర్కొన్నారు.