శ్రీశైలం మల్లన్న ఆలయ హుండీకి భారీగా ఆదాయం సమకూరింది.. ఉభయ దేవాలయాలు, పరివార దేవాలయాల హుండీలను చంద్రావతి కళ్యాణ మండపంలో భద్రత, నిఘా మధ్య ఆలయ అధికారులు సిబ్బందితోపాటు శివసేవకులు లెక్కించారు. గత 28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.2,58,56,737 ఆదాయం వచ్చినట్లు ఇంఛార్జ్ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. డబ్బుతో పాటుగా 379 గ్రాముల బంగారం, సుమారు 8.80 కేజీల వెండిని కూడా భక్తులు కానుకలుగా సమర్పించారు. మరోవైపు వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ హుండీలో ఉంది. యూఎస్‌ఏ డాలర్లు 1093, కెనడా డాలర్లు 215, మారిటియస్ 25 కరెన్సీ, మలేషియా రింగేట్స్ 21, యూకే పౌండ్స్ 20, యూఏఈ దీర్హామ్స్ 10, మాల్టీవ్స్ రుఫియాస్ 10, ఈరోస్ 10, సింగపూర్ డాలర్లు రెండు భక్తులు కానుకలుగా సమర్పించారు.
మరోవైపు రాఘవేంద్ర స్వామి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. మొత్తం రూ.3,38,02,400 ఆదాయం వచ్చినట్లు మఠం మేనేజర్ వెంకటేశ్ జోషి తెలిపారు. సెప్టెంబరు చివరి నుంచి అక్టోబరు 24వ తేదీ వరకు వచ్చిన హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. రాఘవేంద్ర స్వామికి కానుకలు, ముడుపుల రూపంలో భక్తులు సమర్పించిన నగదు రూ.3,30,57,440.. అలాగే చిల్లర నాణేలు రూ.7,44,960 కలిపి మొత్తం రూ.3,38,02,400 సమకూరాయి. అలాగే బంగారం 136 గ్రాములు, వెండి 1,180 గ్రాములు వచ్చింది. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశారు.