ఐదు నెలల్లో రూ. 59 వేల కోట్లు అప్పులు తెచ్చిన కూటమి ప్రభుత్వం.. సూపర్ సిక్స్ హామీలకు ఎంత ఖర్చు చేసిందంటూ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. ఆదివారం ఆయన తాడేపల్లిగూడెంలోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐదు నెలల పాలనలోనే ప్రజలు తిరస్కరించే స్థితికి వచ్చారని దుయ్యబట్టారు.‘‘ప్రజలు ఓటు వేశారంటే.. ఆంబోతుకి అచ్చేసి వదిలేసినట్లు కాదు. అధికారం వస్తే ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించడం కాదు. స్థానిక ఎమ్మెల్యే అడ్డగోలుగా మాట్లాడటం సరికాదు. ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతుంటే దానికి స్థానిక ఎమ్మెల్యే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాడేపల్లిగూడెంలో లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకున్నవా? మీ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల కాలంలో పట్టణంలో నాలుగు హత్యలు జరిగాయి.
నేరుగా బెల్టు షాపులు గురించి మీ ఎల్లో మీడియాలొనే రాస్తున్నారు.. మాట్లాడే ముందు సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడాలి’’ అని కొట్టు సత్యనారాయణ హితవు పలికారు. ‘‘రోడ్లు, గుంతలు గురించి మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లలో ఎన్ని రోడ్లు వేశారు?. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో నవాబ్‌పాలెం నుంచి నిడదవోలు, చిలకంపాడు లాకుల నుండి వెంకట్రామన్నగూడెం వరకు రూ. 45 కోట్ల నిధులతో నాలుగు లైన్స్ రోడ్లు వేశాం కనబడట్లేదా?. వైయస్ జగన్ కుటుంబం గురించి మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడాలి. చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడగలవా?’’ అంటూ కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.