శిక్షణ కార్యక్రమా లు పేరుతో ఉ పాధ్యాయులను వేధించడం తగదని ఏపీటీఎఫ్ నాయకులు శ్రీకాకుళం ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ కేంద్రం వద్ద గురువారం నిరస న ప్రదర్శన నిర్వహించారు. మన్యం జిల్లాలో శ్రీనివాస్ అనే ఉపా ధ్యాయుడి మరణంపై ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు పేడాడ అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణలో ఉపాధ్యాయుల వరుసగా అనారోగ్యానికి గురై గుండెపోటుతో మరణించారన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా శిక్షణ రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహించడం మాన డంలేదన్నారు. అనంతరం శిక్షణ కేంద్రంలో డీఈవో ఎస్.తిరుమల చైతన్యను, రాష్ట్ర పరిశీలకులు కల్పనలను కలిసి 50 ఏళ్లు పైబడిన వారికి శిక్షణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కార్యక్రమం లో ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి చావలి శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిలర్లు బి.చంద్రశేఖర్, పి.శ్రీరామ్మూర్తి, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ టి.సూర్యనారాయణ, సీహెచ్ త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |