నడిమివలస మండల పరిషత్ పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 69వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు.
ఆర్థికవేత్త న్యాయ కోవిదుడు, అంటరానితనం వివక్షాలపై అలుపెరగని పోరుచేసి భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మహనీయుడని విద్యార్థులకు తెలిపారు.