చింతూరు మండలం మోతగూడెంలో అంబేద్కర్ 68వ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలలో వెలుగులు నింపిన మహానుభావుడు అంబేద్కర్ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో అపూర్వ భరత్, ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ వాసుదేవరావు, డిఈ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.