పెదబయలు మండలంలోని జామిగుడ పంచాయతీ కొజ్జరిగుడలో శుక్రవారం ఓ జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. నిర్మాణంలో ఉన్న కల్వర్టు డైవర్షన్ రహదారిలో వర్షాలకు రోడ్డు దిగిపోయి జీపు బోల్తా పడింది.
జీప్ డ్రైవర్ ముందుగా దూకేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికలు తెలిపారు. చిత్రకొండలో ఓ కుటుంబ సభ్యులను డ్రాప్ చేసి తిరిగి అరకులోయ వెళ్తుండగా జీపు బురదలో జారి ప్రమాదానికి గురైందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa