రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు రక్తదానం చేశారు. రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకు డా అమలు చేస్తున్న పార్టీ టీడీపీ అన్నారు. దేశంలో మొదటి సారిగా దళిత వ్యక్తి జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా, ప్రతిభా భారతిని శాసన సభ స్పీకర్‌గా చేసిన ఘనత టీడీపీదే అని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా దళిత బిడ్డ కాకి మాధవరావును, ఎస్సీ కమీషన్‌ను ఏర్పాటు చేసి జస్టిస్ పున్నయ్యను నియమించడం ద్వారా అంబేద్కర్ స్పూర్తితో నాడు చంద్రబాబు పని చేశారని వెల్లడించారు.నేషనల్ ఫ్ట్రంట్ చైర్మన్‌గా ఎన్టీఆర్ ఉండగానే అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చి గౌరవించారన్నారు. గత తెలుగుదేశం హయాంలో ఎస్సీ సబ్ ప్లాన్‌ను సమర్ధవంతంగా అమలు చేస్తే, గత వైసీపీ పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను కూడా దారి మళ్ళించారని మండిపడ్డారు. ‘‘నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటూ 27 దళిత స్కీమ్స్‌ను రద్దు చేసి దళితులకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారన్నారు. ఒక దళిత వ్యక్తిని వైసీపీ ఎమ్మెల్సీ చంపేసి, ఇంటికి డోర్ డెలివరీ చేస్తే, అతనికి సన్మానం చేసిన ఘనుడు జగన్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.