ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలో మంగళవారం ఘోర సంఘటన చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్ళితే.... పట్టణంలోని పూలసుబ్బయ్య కాలనీలో నివాసం ఉంటున్న రాజు, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో మొదటి కుమారుడు కార్తీక్ రెండవ కుమారుడు యశ్విన్ (16)లు ఉన్నారు. వీరిలో కార్తీక్ గుంటూరు జిల్లా పేరేచర్లలోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. యశ్విన్ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం వేకువ జామున కార్తీక్ను రైలు ఎక్కించేందుకు అన్న బైకుపై యశ్విన్ వెనుక కూర్చున్నాడు. అన్నద మ్ములు ఇంటి నుంచి రైల్వేస్టేష్కు వెళ్లే మార్గంలో రాయవరం వద్ద రైల్వే వర్ బ్రిడ్జిపై బైకు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొంది. దీంతో బైకు వెనుక కూర్చున్న యశ్విన్ తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఘటన స్థలంలోనే ఆయన మృతి చెం దాడు. బైకు నడుపుతున్న కార్తీక్ గాయాలతో బయటపడి వైద్యసేవలు పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని రూరల్ ఎస్ఐ అంకమ్మరావు తన సిబ్బందితో కలిసి పరిశీలించి ప్రమాద వివరాలను నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజన వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.