అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కూటమి రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్ మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకుగాను టీడీపీ అధిష్టానం విడుదల చేసిన జాబితాలో తనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సతీష్ ఆనందం వ్యక్తం చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సీఎం చంద్రబాబును కలిశారు.