మనస్తాపానికి గురై యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా, మందసలో చోటుచేసుకొంది. మందస ఏఎస్ఐ కె.శేఖరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కుమ్మరవీధికి చెందిన బెహర రామకృష్ణ(33) ఇంటి సమీపంలో ఇటుక బట్టిని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యం సేవించి తరచూ ఇంటికి వస్తుం డడంతో కుటుంబసభ్యులు మందలిస్తుండేవారు. అదేవిధంగా సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు ఆయనను ప్రశ్నించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపో యాడు. ఎప్పటికీ ఇంటికి రాకపో వడంతో తండ్రి బెహరా శ్యాం, కుటుంబసభ్యులు గాలించారు. అయితే గ్రామ సమీపంలోని పురిపాకలో ఇటుక బట్టిలో ఉన్న లుంగీతో ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడు. దీనిని గుర్తించి తండ్రి బెహర శ్యాం మంగళవారం మందస పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య, ఆరు నెలల కుమార్తె ఉన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి హరిపురం సీహెచ్సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శేఖరరావు తెలిపారు.