భారత దేశంలోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలంటూ బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మహఫుజ్ ఆలం సోషల్ మీడియా వేధికగా ఓ పోస్టు పెట్టారు. బంగ్లాదేశ్ విజయ్ దివాస్ సందర్భంగా ఆయన ఈ పోస్టు పెట్టగా.. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడింది. దీంతో మహఫుజ్ ఆలం కాస్త వెనక్కి తగ్గి తాను పెట్టిన పోస్టును ఫేస్‌బుక్ నుంచి తొలగించారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బంగ్లాదేశ్ తాత్కాలిక సారధి, నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ సన్నిహితుడు, ముఖ్య సలహాదారు అయిన మహఫుజ్ ఆలం తాజాగా వివాదాస్పద పోస్టు పెట్టారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ విజయ్ దివాస్ సందర్భంగా డిసెంబర్ 16వ తేదీన.. భారతదేశంపై తనకు ఉన్న అక్కసును వెళ్లగక్కారు. ఫేస్‌బుక్ వేధికగా భారత దేశంలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలంటూ రాసుకొచ్చారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ వృద్ధికి భారత్ ఆటంకం కల్గిస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఇండియాపై ఆధార పడడాన్ని బంగ్లాదేశ్ ఈ ఏడాది నుంచి తగ్గించేందుకు చాలా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
మహఫుజ్ ఆలం చేసిన పోస్టు చూసిన భారత విదేశాంగ శాఖ ఫైర్ అయింది. వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చలు నిర్వహించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచించి.. ఆచితూచి వ్యవహరించాలని బంగ్లా నేతలకు సూచించినట్లు వివరించారు.
అలాగే బంగ్లాదేశ్ ప్రజలతో పాటు తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలు పెంచుకోవడానికి భారత్ ప్రయత్నాలు చేస్తుంటే.. ముఖ్య నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర అసహనానికి గురి చేసిందని అన్నారు. తాము బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత మహుఫుజ్ ఫేస్‌బుక్ పోస్టును తొలగించినట్లు స్పష్ట చేశారు.
2025 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఈవెంట్‌లో.. షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోయారు. ఇక అప్పటి నుంచి భారత దేశంలోనే ఆమె తలదాచుకుంటున్నారు. అయితే షేక్ హసీనా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి సూత్రధారి ముహఫుజ్‌యే అని గతంలో యూనస్ ప్రభుత్వం తెలిపింది.