అంగన్‌వాడీ కేంద్రాలను ఆయా సీడీపీవోలు ఎ ప్పటికప్పుడు పర్యవేక్షించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. కలెక్ట రేట్‌లో ఐసీడీఎస్ అధికారులతో ఆయన గురువారం స మీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలకు సకాలంలో పా లు, గుడ్లు పంపిణీ జరగాలని, ముఖ్యంగా గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా చూడాలని, తాగునీటి సౌకర్యం, నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో గ్రామీణ నీటిపా రుదల శాఖ, పంచాయితీరాజ్ శాఖల అధికారులు సమ న్వయం చేసుకోవాలని స్పష్టం చేసారు. క్షేత్రస్థాయి పర్య టనలు తప్పనిసరిగా చేయాలని, ఈ విషయంలో వెనుక బడ్డ సీడీపీవోలు పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో బాల్య వివాహాలు అ రికట్టడానికి గ్రామస్థాయి, మండల స్థాయిల్లో నిర్వహిం చబోయే సమావేశాలు, అవగాహనా కార్యక్రమాల ప్రణా ళికను సిద్ధం చేసి అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన సాక్షం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇంకు డు గుంతలు, ఇతర సామగ్రి పంపిణీ పనులు వెంటనే పూర్తి చేయాలి, ప్రతీ రోజు సీడీపీవో, సూపర్‌వైజర్లు క్ర మం తప్పకుండా ఆయా కేంద్రాలను పర్యవేక్షించి, నిర్ల క్ష్యంగా విధులు నిర్వర్తించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐసీడీఎస్‌లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది అంకితభావం, చిత్తశుద్ధితో సేవలందించాలని, ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకుని వస్తే పరి ష్కారానికి కృషి చేస్తానన్నారు. టీహెచ్‌ఆర్ శతశాతం ల బ్ధిదారునికి అందేలా చూడాలని, మాతా, శిశు మరణాల నియంత్రణ దిశగా పనిచేయాలని స్పష్టం చేశారు.