ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లిని కొడుకు పెళ్లి చేసుకున్నాడా.. పాకిస్తాన్‌లో ఇది నిజంగానే జరిగిందా

international |  Suryaa Desk  | Published : Mon, Jan 06, 2025, 08:59 PM

ఇటీవల ఓ వార్త మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయింది. పాకిస్తాన్‌లో తల్లీ కొడుకు పెళ్లి చేసుకున్నారు అంటూ ఆ వార్త తెగ హల్‌చల్ చేసింది. అది విన్న వారంతా తల్లిని కొడుకు పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆశ్చర్యంతోపాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇక ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అది ఎంత వరకు నిజం అని తెలుసుకోకుండానే ఆ తల్లీ, కొడుకులను ఇష్టం వచ్చినట్లు తిట్టిపోశారు. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలిసి వారు నోరెళ్లబెట్టారు. దీంతో దీనిపై న్యూస్ మీటర్ అనే సంస్థ ఫ్యాక్ట్‌చెక్ చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


క్లెయిమ్:


పాకిస్తాన్‌లో ఓ యువకుడు తన తల్లిని పెళ్లి చేసుకున్నట్లుగా ఉన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాతోపాటు మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. ట్విటర్‌లో ఒక వ్యక్తి వీడియోను పోస్ట్ చేసి.. "18 ఏళ్లుగా తనను పెంచిన తల్లిని ఓ కుమారుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అబ్దుల్ అహద్ అనే వ్యక్తి దీన్ని సోషల్ మీడియాలో స్టోరీ పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అబ్దుల్ అహద్ వెల్లడించాడు. ఇప్పుడు అబ్దుల్ తన తల్లి వద్ద డబ్బులు తీసుకుంటాడు" అని క్యాప్షన్ పెట్టాడు.


నిజం ఏంటి?


పాకిస్తాన్‌లో తల్లిని కుమారుడు పెళ్లి చేసుకున్నాడు అని వైరల్ అవుతున్న వార్త పూర్తిగా తప్పు. ఆ యువకుడు తన తల్లికి దగ్గరుండి రెండో పెళ్లి జరిపించగా.. దాన్ని అతడే పెళ్లి చేసుకున్నాడు అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అతడు చెప్పిన విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని.. కొన్ని మీడియా, సోషల్ మీడియాల్లో వార్తలు తప్పుగా ప్రచురించారు.


ఫ్యాక్ట్‌చెక్ ఎలా చేశారు?


అయితే ఈ వార్తపై ఫ్యాక్ట్‌‌చెక్ చేసిన న్యూస్ మీటర్ అది తప్పు అని తేల్చింది. ఆ యువకుడు తన తల్లిని పెళ్లి చేసుకోలేదని.. మరో వ్యక్తితో రెండో పెళ్లి చేయించాడు అని తెలిసింది. అసలు ఈ కన్ఫ్యూజన్‌కు ప్రధాన కారణం.. ఆ వైరల్ అవుతున్న వీడియోతో జత చేసిన క్యాప్షన్. ఎందుకంటే అందులో ‘married off’ అనే పదం ఉండగా.. దాన్ని అపార్థం చేసుకున్న నెటిజన్లు, కొన్ని మీడియా సంస్థలు.. యువకుడు తన తల్లినే పెళ్లి చేసుకున్నాడు అనే అర్థంలో వార్తలు వైరల్ చేశారు. అయితే ఇదే ‘married off’ అనే పదాన్ని వేరే వాళ్లతో పెళ్లి జరిపించడంలో కూడా ఉపయోగిస్తారు. అయితే పద ప్రయోగంలో జరిగిన తప్పు కారణంగా ఇలా మొత్తం అర్థమే మారిపోయింది.


ఇక సంబంధిత కీవర్డ్ ద్వారా గూగుల్‌లో సెర్చ్ చేయగా.. హిందుస్థాన్ టైమ్స్‌ రాసిన ఒక వార్త కనిపించింది. 2020 డిసెంబర్ 30వ తేదీన రాసిన వార్తను గుర్తించారు. ఒక కుమారుడు తన తల్లికి రెండో పెళ్లి చేసి మనసులను గెలుచుకున్నాడు అని ఆ వార్త సారాంశం. ఇక అబ్దుల్ అహద్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో.. తన తల్లి రెండో పెళ్లి చేసిన సందర్భంగా వారిద్దరి మధ్య ఉన్న తల్లీకొడుకుల ప్రేమను చూపించే క్షణాలు ఉన్నాయి. తన తల్లికి రెండో పెళ్లి చేసిన సందర్భంగా వారిద్దరూ ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్న విషయాన్ని తెలుపుతోంది.


ఇక ఇండియా టుడేలో పబ్లిష్ అయిన ఒక వార్త కూడా కనిపించింది. ఆ సమాచారం ఆధారంగా అబ్దుల్ అహద్ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ గుర్తించగా.. అందులో 2024 డిసెంబర్ 18వ తేదీన పోస్ట్ చేసిన వీడియో దొరికింది. అయితే ఆ వీడియో ఆ యువకుడి తల్లికి రెండో పెళ్లి చేసినట్లుగానే ఉంది. ఇక 2024 డిసెంబర్ 20వ తేదీన అబ్దుల్ అహద్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వైరల్ వీడియోతో ప్రస్తుతం తల్లీకొడుకులు పెళ్లి చేసుకున్నారు అంటూ వైరల్ అవుతున్న ఫోటో కనిపించింది.


 అసలు వాస్తవం ఇది


పాకిస్తాన్‌లో యువకుడు తన తల్లిని పెళ్లి చేసుకున్నట్లు వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా తప్పు అని తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com