మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఫోక్సో కేసులో చెవిరెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మెల్యేపై తిరుపతి పోలీసులు ఫోక్సో కేసు పెట్టారు. తిరపతిలో నమోదైన ఫోక్సో కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టును చెవిరెడ్డి ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం చెవిరెడ్డి పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఓ బాలికపై చెవిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అది రుజువు కావడంతో తిరుపతి పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఆ తరువాత అటువంటి వ్యాఖ్యలు చేయలేదని బాలిక తండ్రి చెప్పినప్పటికీ అంతకుముందు ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న పోలీసులు చెవిరెడ్డిపై ఫోక్సో కేసు పెట్టారు.ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, అలాంటి వ్యాఖ్యలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే కోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన తరపున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు ఉదయం తీర్పు ఇచ్చిన హైకోర్టు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.