ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క వర్కౌట్‌తో బరువు తగ్గడం నుంచి ఎన్నో లాభాలు, ఎలా చేయాలంటే

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Jan 13, 2025, 11:54 PM

ఫిట్‌నెస్ జర్నీలో పైలేట్స్ ముందువరుసలో ఉంటాయి. ఈ వర్కౌట్స్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కారణంగా.. వీటికి చాలా క్రేజ్ పెరిగిపోయింది. హీరోయిన్స్ అయితే మరీనూ. పైలేట్స్ చేస్తూ వారి ఫిట్‌నెస్‌ని పెంచుకుంటున్నారు.


వీటికి ఎందుకంత క్రేజ్ అంటే ఈ ఒక్క వర్కౌట్‌తో బాడీ మొత్తానికి హెల్ప్ అవుతుంది. బరువు తగ్గడం నుంచి చాలా లాభాలు ఉంటాయి. ఈ వర్కౌట్ చేయడం వల్ల స్పీడ్‌గా బరువు తగ్గుతారు. వీటిని చేయడం వల్ల కండరాలలో బలం పెరుగుతుంది. కీళ్ల నొప్పుల నుండి రిలాక్స్ కూడా అవుతారు. ఇంకెన్నో లాభాలో తెలుసుకోండి.


ఎముకల బలానికి


​ఎముకల్లో బలానికి పెంచేందుకు ఎముకల్లో సాంద్రత పెంచేందుకు ఈ వర్కౌట్ హెల్ప్ చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో సాంద్రత తగ్గుతుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారతాయి. త్వరగా విరిగిపోవడం జరుగుతుంది. ఎముకల్లో డెన్సిటీని పెంచుకునేందుకు ఈ వర్కౌట్ చేయొచ్చు.


ఫ్లెక్సిబిలిటీ


పైలెట్స్ చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. పోశ్చర్ కూడా బాగుంటుంది. వెన్నెముక, కండరాలకి చాలా మంచిది. అదే విధంగా వెన్నునొప్పితో బాధపడేవారికి ఇది బెస్ట్ వర్కౌట్ అని చెప్పొచ్చు. రెగ్యులర్‌గా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.


బరువు తగ్గేందుకు


పైలేట్స్ చేయడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. ఇవి చేయడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. రెగ్యులర్‌గా చేసేవారికి మంచి రిజల్ట్ ఉంటుంది. పైలేట్స్ అనేవి ఒక్క ఎక్సర్‌సైజ్ కాదు. కొన్ని రకాలుగా ఉంటాయి. రోజుకొకటి ట్రై చేసినా బరువు తగ్గుతారు. దీనికోసం మీరు ఇంటర్నెట్‌లో కూడా వర్కౌట్స్ కూడా వెతకొచ్చు.


ఇమ్యూనిటీ కోసం


ఈ వర్కౌట్ చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముఖ్యంగా పెద్దవారిలో ఇమ్యూనిటీ పెరిగేందుకు ఈ పైలేట్స్ హెల్ప్ చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో సీజన్‌లో వచ్చే సమస్యలు జలుబు, దగ్గు, జ్వరం వంటివి దూరమవుతాయి. ఎక్కువగా చిన్న పిల్లలు, పెద్దవారిలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.


మెంటల్ హెల్త్


పైలెట్స్ చేయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ అవేర్‌నెస్ పెరుగుతుంది. నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. దీంతో మానసిక ఆరోగ్యం మెరుగ్గా మారి ఆందోళన, నిరాశ తగ్గుతుంది. వీటిని చేయడం వల్ల ఒత్తిడి లేకుండా ఉంటుంది. దీంతో ఒత్తిడి కారణంగా వచ్చే చాలా సమస్యల్ని దూరం చేసుకున్నవారవుతాం.


నిద్ర సమస్యలు


రెగ్యులర్‌గా పైలేట్స్ చేస్తే నిద్ర సమస్యలు దూరమవుతాయి. నిద్రలేమితో బాధపడేవారికి ఈ పైలేట్స్ హెల్ప్ చేస్తాయి. కాబట్టి, రెగ్యులర్‌గా చేయాలి. మజిల్స్‌కి కూడా చాలా మంచిది. వీటిని రెగ్యులర్‌గా చేయడం చాలా మంచిది.


ఎలా చేయాలి?


ముందుగా మంచి స్రెచెబుల్ డ్రెస్ వేసుకోవాలి. మూమెంట్స్‌ని బట్టి ఈ డ్రెస్ స్ట్రెచ్ అవుతుంది.


ఎక్సర్‌సైజ్ మ్యాట్ తీసుకోండి. దీని వల్ల మనం పాదాలు, చేతులు నేలపై పెట్టినప్పుడు జారకుండా ఉంటాయి.


వెల్లకిలా పడుకోవాలి.


కాళ్ళు గోడవైపుగా చాపాలి.


చేతులు అపోజిట్ డైరెక్షన్‌లో ఉంచాలి.


ఇలా ఒక్కో మూమెంట్‌కి మార్చాలి.


పైలెట్స్ చాలా రకాలుగా ఉంటాయి.


ఒక్కో పొజిషన్‌కి మారుస్తూ ఉండాలి.


పొజిషన్ మారినప్పుడల్లా గ్యాప్ తీసుకుంటుండాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com