అన్ని దేశాల్లో తెలుగువారు రాణించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాజకీయాల్లో యువతను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని అన్నారు. దాదాపు అన్ని దేశాల్లో తెలుగువారి ముద్ర ఉంటుందని చెప్పారు. తెలుగువారు ఎక్కడైనా రాణించగలుగుతారని అన్నారు. తెలుగు వారికి నైపుణ్యం, పట్టుదల ఎక్కువ అని చంద్రబాబు తెలిపారు. తాను గతంలో రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు మీరంతా మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.చాలా దేశాల్లో ఉన్న తెలుగువారు నిరసన తెలిపారని చెప్పారు. కూటమి గెలుపులో ఎన్‌ఆర్‌ఐల పాత్ర ఎంతో ఉందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. యువత ఎప్పుడూ భవిష్యత్ దిశగా ఆలోచించాలన్నారు. సంపద సృష్టించడం కష్టం కాదని చెప్పారు. 2047 నాటికి తెలుగువారు గొప్పగా ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు రావాలని అన్నారు సీఎం చద్రబాబు. ఎక్కడికి వెళ్లినా మూలాలు మరిచిపోకూడదని చెప్పారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.కాగా.. జ్యూరిచ్ హిల్టన్ హోటల్లో భారత రాయబారి మృదుల్ కుమార్‌తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం భేటీలు నిర్వహించింది. ఏపీ ఫార్మా రంగంలో పెట్టుబడులకు సహకరించాలని.. స్విస్ రాయబారి మృదుల్ కుమార్‌ను చంద్రబాబు బృందం కోరారు. అనంతరం తెలుగు కమ్యూనిటీతో చంద్రబాబు 'మీట్ అండ్ గ్రీట్' నిర్వహించనున్నారు. జ్యూరిచ్ నుంచి దావోస్‌కు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.