స్టీల్ ప్లాంట్‌లో పునరుత్తేజం తెచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వాజ్‌పేయి సమయంలో ఇప్పుడు రూ.11,400 కోట్లు ఇచ్చి కాపాడింది చంద్రబాబు అని తెలిపారు. బాబు ఉంటేనే స్టీల్ ప్లాంట్ ఉంటుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం నుంచి రూ.11,400 సాయం రావడం అంత చిన్న విషయం కాదన్నారు. నాలుగున్నరేళ్ల నుంచి కార్మికులు, నిర్వాసితులు పోరాటం మర్చిపోలేనిదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుపోతుందని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.ఐదేళ్లు వైసీపీ నాయకులు ప్లాంట్ కోసం మానేసి కేసులు కోసం మాట్లాడారు తప్ప మరొకటి చెయ్యలేదని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కోటి మంది సభ్యత్వం మైలురాయి దాటిందన్నారు. ఈసారి సాంకేతిక బాగా వినియోగించామని.. కేవలం 15 సెకన్లలో మెంబర్ షిప్ ప్రక్రియ పూర్తి అయ్యిందని తెలిపారు. ఈ ఘనత పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు, 30 ఏళ్ల పార్టీ నడిపిన చంద్రబాబు, నూతన సాంకేతిక జోడించిన యువ నాయకులు నారా లోకేష్ ది అని వెల్లడించారు.